Gold Price Today : భారతీయులలో, ముఖ్యంగా మహిళల్లో, బంగారం ఆభరణాల పట్ల ఆసక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, వివాహాలు, శుభకార్యాలు వంటి వేడుకల్లో బంగారం ఆభరణాల కొనుగోలుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే డిమాండ్ పెరుగుతున్న క్రమంలో బంగారం ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల బంగారం ధరలు జీవితకాల గరిష్ట స్థాయిలను చేరుకోవడం విశేషం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన వివిధ వ్యాఖ్యలు, ముఖ్యంగా మెక్సికో, కెనడా వంటి దేశాలపై టారిఫ్స్ విధించేందుకు తీసుకున్న నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితిని కలిగించాయి. ఈ పరిణామాలు బంగారం ధరలను మరింత ఎగబాకేలా చేశాయి.
All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (జనవరి 27) స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2758 డాలర్ల వద్ద ఉంది, గత రోజుతో పోలిస్తే దాదాపు 20 డాలర్లు తగ్గింది. స్పాట్ సిల్వర్ రేటు 30.20 డాలర్ల స్థాయిలో ఉంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.26 వద్ద ఉంది.
దేశీయ ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 75,550 వద్ద కొనసాగుతోంది. గత వారం మూడు రోజుల్లో రూ. 300, రూ. 750, రూ. 150 మేర పెరిగిన ధర, మిగతా రోజుల్లో స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,420 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,700గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,570గా ఉంది.
వెండి ధరలు:
బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వెండి ధరలు మార్కెట్‌లో స్థిరత్వాన్ని చూపుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 97,500గా ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో అదే వెండి ధర రూ. 1.05 లక్షలు పలుకుతోంది.
బంగారం, వెండి ధరలు ప్రాంతానికి అనుగుణంగా మారుతాయి. స్థానిక పన్నులు, ఇతర ఖర్చులు వీటి మార్పులకు కారణమవుతాయి. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండగా, వెండి రేట్లు తక్కువగా ఉన్నాయి.
PM Modi Visit Mahakumbh: ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు?