Gold Price Today : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల కాలంలో పతంగి ఎగిరినట్లు పెరుగుతూ రికార్డు గరిష్ఠాలను తాకాయి. రోజువారీ పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుండగా, ఇవాళ మాత్రం స్వల్ప స్థిరత్వం కనిపించింది. ఈ రోజు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుండటంతో కొంతమందికి ఊరట కలిగించింది. అయితే, బులియన్ మార్కెట్ వర్గాలు మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడం, దేశీయంగా కొనుగోళ్ల పెరుగుదల వంటి అంశాలు బంగారం రేట్లను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషించాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తాజా గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికాలో ఆర్థిక, రాజకీయ పరిణామాలు పసిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగారం ధరలు వేగంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2771 డాలర్లను అధిగమించగా, స్పాట్ సిల్వర్ ధర కాస్త తగ్గి 30.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, భారతీయ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనపడింది. ప్రస్తుతం మారకం విలువ రూ.86.260 వద్ద నమోదైంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. క్రితం రోజు 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.300 మేర పెరిగి రూ.75,550 వద్దకు చేరగా, ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. అదే విధంగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.82,420 వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో ధర రూ.1,05,000 వద్ద స్థిరంగా ఉంది. గత వారం రోజుల్లో రూ.1,000 మేర పెరుగుదల కనిపించగా, ఇవాళ రేట్లు మారకుండా నిలకడగా ఉన్నాయి.
ఈ రేట్లు ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవే. ట్యాక్సులు, ఇతర ఛార్జీలు ఈ గణాంకాల్లో చేర్చలేదు. ఈ కారణంగా, ప్రాంతానుసారం ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ధరలు మారే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోవాలి. బంగారం కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ వివరాలను ఉపయోగించుకోవచ్చు.
Osmania Hospital: ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం!