Gold Price Today : బంగారం ధరలు ఆల్‌టైం రికార్డ్..

Gold Price Today : ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీ తనకు ఏదో చెప్పబోయారని, కానీ నేను టారిఫ్‌లు తప్పవన్నానని తాజాగా వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలో ఊహించని మార్పు ఏర్పడింది. ఒక్కసారిగా గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఫిబ్రవరి 20వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Published By: HashtagU Telugu Desk
Gold And Silver Rate

Gold And Silver Rate

Gold Price Today : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో, పెరుగుతున్న టారిఫ్‌లపై ఎవరకీ మినహాయింపు ఉండకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది, ఎందుకంటే ట్రంప్ మోదీతో తమ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలో పరస్పర పన్నుల విధింపుపై ముఖ్యమైన అభిప్రాయాలు పంచుకున్నారు. ట్రంప్ ఈ విషయాన్ని బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు, ఈ సందర్భంగా ఎలాన్ మస్క్‌తో కలిసి మాట్లాడినప్పుడు, మోదీతో జరిగిన భేటీ గురించి పంచుకున్నారు.

ట్రంప్ మాట్లాడుతూ, “మేము పరస్పరం పన్నులు విధించేందుకు సిద్ధం అవుతున్నాము. మీరు ఎంత ఛార్జి చేస్తే, మేమూ అంతే విధిస్తాము,” అని మోదీకి చెప్పానని వెల్లడించారు. అయితే, దీనిపై మోదీ స్పందిస్తూ, “మీరు ఎంత ఛార్జి వేస్తే, నేను కూడా అంతే విధిస్తాను” అని స్పష్టం చేశారని ట్రంప్ చెప్పారు. ఇది తప్పుడు అవగాహనలు లేకుండా, పారదర్శకమైన చర్చ జరిగినట్టు ట్రంప్ తెలిపారు. ఈ సంభాషణను వెల్లడించడంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

 Yashtika Acharya: 270 కేజీల రాడ్‌ మెడపై పడి.. యశ్తికా ఆచార్య మృతి.. ఎవరామె ?

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు 2940 డాలర్ల వద్ద ట్రేడవుతుంది, , స్పాట్ సిల్వర్ ఔన్సుకు 32.77 డాలర్ల వద్ద ఉన్నాయి. మరోవైపు, భారతీయ రూపాయి విలువ మరింత పడిపోయింది, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 86.968 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో, బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. ఈ రోజు ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.700 పెరిగింది. మూడు రోజులలో మొత్తంగా రూ.1580 పెరిగింది, తద్వారా తులం ధర రూ.87,650 వద్ద చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ.650 పెరిగి, మూడు రోజులలో మొత్తం రూ.1450 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.80,350 మార్క్ ను దాటింది.

ఇంకా, వెండి ధర మాత్రం హైదరాబాదులో ఐదో రోజూ స్థిరంగా కొనసాగుతోంది. ఈ రోజు, ఒక కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద నిలిచింది. బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతూ కొంత ఊరట కల్పిస్తున్నాయి. ఈ ధరలు 20వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. మధ్యాహ్నం గోల్డ్ రేట్లలో మార్పు సంభవించవచ్చు. అలాగే, ప్రాంతం ప్రకారం గోల్డ్ , సిల్వర్ ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు, అందుకు ట్యాక్సుల వలన మార్పులు రావచ్చు. కనుక, కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లను తెలుసుకోవడం ఉత్తమం.

 KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్.. ఎన్నిక‌ల‌ప్పుడే ప్ర‌జ‌లు గుర్తొస్తారు: మంత్రి

  Last Updated: 20 Feb 2025, 09:36 AM IST