Site icon HashtagU Telugu

Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్

Cm Revanth Yellampalli

Cm Revanth Yellampalli

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని తరలిస్తున్నామని చెప్పింది కానీ, వాస్తవానికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలిపోయాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గోదావరి జలాలను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉస్మాన్ సాగర్ వద్ద ఒక తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన చేశారు.

KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ‘కూలేశ్వరం’గా మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో జరిగిన లోపాలను ప్రస్తావిస్తూ, వాటి నిర్మాణం నాసిరకంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయలేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకురావాల్సి వస్తోందని తెలిపారు. ఇది గత ప్రభుత్వ వైఫల్యమని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా నల్గొండ జిల్లా ప్రజల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడానికి మూసీ నది కాలుష్యమే ప్రధాన కారణమని, దీనిని శుభ్రం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రక్షాళన ద్వారా నల్గొండ ప్రజల కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.