Site icon HashtagU Telugu

Gitam Student Suicide : గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ..వీడియో వైరల్

Gitam Student Suicide

Gitam Student Suicide

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కలవరపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసి కూడా జీవితంపై విరక్తితో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు (Suicide) కలకలం రేపుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది ప్రేమ విఫలమై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో పలు యూనివర్సిటీలలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ రేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. అందరు చూస్తుండగానే కాలేజీ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేసి ప్రాణాలు తీసుకుంది. మాదాపూర్‌కి చెందిన రేణుశ్రీ (Renusri)మూడు నెలల క్రితమే డే స్కాలర్‌గా గీతం వర్సిటీ(Gitam University) లో చేరింది. డేస్కాలర్‌గా చేరిన మూడు నెలలకే రేణుశ్రీ బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చదువు ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకే ముందు రేణుశ్రీ ఓ ఫోన్‌కాల్‌ మాట్లాడిందని పోలీసులు గుర్తించిందని సమాచారం. ఆ కాల్‌ తల్లిదండ్రులకు చేసిందా లేక మరెవరికైనా చేసిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువతీ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

Read Also : Aadhaar Card: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. సేఫ్ గా ఉంచేందుకు మాస్క్డ్ ఆధార్ ఫీచర్!