Site icon HashtagU Telugu

TG 10th Results : టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

Deputy CM Bhatti

Deputy CM Bhatti

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 2025 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి (SSC) ఫలితాల (10th Results) విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో రెగ్యులర్‌గా పరీక్షలు రాసిన 4,96,374 మంది విద్యార్థులలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు

ఈ ఫలితాలలో బాలికలు మరోసారి బాలురకంటే మెరుగైన ప్రతిభను ప్రదర్శించాయి. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన 10,733 మంది విద్యార్థుల్లో 57.22 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోని 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలల స్థాయిలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇది రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి మంచి సంకేతంగా చెప్పవచ్చు.

ఫలితాల విడుదల కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, హర్కర వేణుగోపాల్ రావు గారు హాజరయ్యారు. విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యల వల్లే ఈ స్థాయి విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని సైతం సీఎం ప్రశంసించారు.