Site icon HashtagU Telugu

Girl kidnapped: యువతి కిడ్నాప్ కలకలం.. కారులో ఎత్తుకెళ్లిన యువకులు

kidnap

Cropped (7)

రాజన్నసిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ (Girl kidnapped) కలకలం సృష్టిస్తోంది. చందుర్తి మండలం మూడవపల్లి గ్రామంలో మంగళవారం ఈ కిడ్నాప్ (Girl kidnapped) వెలుగు చూసింది. ఓ యువతిని నలుగురు యువకులు కారులో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హనుమాన్ ఆలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా ఇద్దరు యువకులు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు.

కిడ్నాపర్లలో ఒకరు తన ముఖాన్ని దాచడానికి గుడ్డ కట్టి, అమ్మాయిని కారు వైపుకు లాగి వాహనం వెనుక సీటులోకి నెట్టడం కనిపిస్తుంది. ఆమెను రక్షించేందుకు వచ్చిన బాలిక తండ్రిని కిడ్నాపర్లు పక్కకు నెట్టివేసి బాధితురాలితో పాటు వేగంగా వెళ్లిపోయారు. కిడ్నాప్‌ను అడ్డుకున్న యువతి తండ్రిపై యువకులు దాడి చేసినట్లు సమాచారం. అయితే యువతికి సంబంధించన వివరాలు, దుండగులు ఎవరనేది, ఎందుకు కిడ్నాప్ చేశారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం

మంగళవారం కిడ్నాప్ జరగడంతో స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు పోక్సో కేసులో జైలుకెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన యువకుడినే స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన కె. జాన్ అనే యువకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాలిక మైనర్ కావడంతో బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.