Site icon HashtagU Telugu

GHMC Commissioner : వివాదంలో చిక్కుకున్న ఆమ్రపాలి

Ghmc Commissioner Amrapali

Ghmc Commissioner Amrapali

జీహెచ్ఎంసీ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali) తన మార్క్ కనపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన ఏ శాఖలో పనిచేసిన ఆ శాఖకు పూర్తి న్యాయం చేస్తుంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆమె కావాలని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అలాంటి ఆమ్రపాలి తాజాగా GHMC కార్మికుల పైన చేసిన కామెంట్స్ ఆమెను వివాదంలో పడేసేలా చేసాయి.GHMC పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదని, ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అప్పుడప్పుడు స్వయంగా మా ఇంట్లో కూడా చెప్పిన సేకరించడం లేదంటూ ఆమ్రపాలి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కార్మికులు నిరసన తెలుపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రేటర్ హైదరాబాద్ ఇంత శుభ్రంగా ఉంది అంటే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే అని వారు తేల్చి చెబుతున్నారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యలపైన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు జిహెచ్ఎంసి కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. దీంతో కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, GHMC లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు అనంతరం కార్మికులు తమ ఆందోళనను విరమించారు.

Read Also : ACB Raids : మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు..