Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అయ్యే పరిస్థితి. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్ దుస్థితిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వర్షాలు లేనప్పుడు కాలువలు, మురికినీటి కాలువ కల్వర్టుల నుండి తేలియాడే చెత్తను తొలగించాలని, సరైన డ్రైనేజీని వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అంతటా వరదలు మరియు కాలువ నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో వరదలను నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
వరద ప్రభావిత కాలనీలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు, సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఫాగింగ్ చేయడం వంటి పనులను ఆరోగ్యశాఖ అదనపు కమిషనర్‌కు అప్పగించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జిల్లా వైద్యాధికారుల సహకారంతో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యపరమైన చర్యలతో పాటు వర్షంతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాల చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆమ్రపాలి ఆదేశాల మేరకు కూకట్‌పల్లి మండలం మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫ్దర్‌నగర్ తదితర ముంపు ప్రాంతాలతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Also Read: Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమా ప్రకటనకి డేట్ ఫిక్స్..!