Gender Determination: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనేది చట్టవిరుద్ధం. పుట్టబోయేది అబ్బాయా ? అమ్మాయా ? అనేది ముందుగా టెస్ట్ చేసి తెలుసుకోవడం, చెప్పడం నేరం. అయినా ఒక ముఠా ఖమ్మం నగరం పరిసర గ్రామాల్లో గర్భిణులకు స్కానింగ్ చేస్తోంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి కారులో వెళ్లి, కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి టెస్టు రిపోర్టులను ఇస్తోంది. ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ముఠా ఆటను కట్టించారు.
Also Read :Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?
ముఠా వివరాలివీ..
- ఖమ్మం నగర శివారులోని బల్లేపల్లికి చెందిన ఆర్‌ఎంపీ చారి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో కలిసి పనిచేశారు.
- చారి, కాత్యాయనిలు చింతకాని మండలం కొరుమూరుకి చెందిన ఆర్‌ఎంపీ మనోజ్‌తో కలిసి ఒక కారును తీసుకున్నారు. ఆల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామగ్రి కొని వాహనంలో ఫిట్ చేయించారు. ఇక ఊరూరా తిరిగి మొబైల్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు.
- ఊర్ల చివర్లలో,ఎవరూ లేని ప్రదేశాల్లో కారులోనే ఈ పరీక్షలు చేసేవారు.
- ఖమ్మం రూరల్‌తో పాటు ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లి ఈ టెస్టులు చేసేవారు.
- ఒక్కో టెస్టుకు రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకునేవారు.
Also Read :Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?
- ఈ వ్యవహారంపై చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మొహమ్మద్‌కి అనుమానం వచ్చి ఎస్‌ఐ షేక్ నాగుల్ మీరాకు సమాచారం ఇచ్చారు.
- నలుగురు గర్భిణులను(Gender Determination)టెస్ట్ చేసేందుకు కొరుమూరులోని మనోజ్ ఇంటికి తీసుకొచ్చారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడే ఆర్‌ఎంపీ మనోజ్, కాత్యాయనీలను పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రధాన నిందితుడు చారి పరారయ్యాడు.
- ఈ ముఠాను ఇన్నాళ్లుగా వైద్యాధికారులు కానీ, పోలీసులు కానీ ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్న ఉదయిస్తోంది.