40 People Hospitalised: జనగాం లో గ్యాస్ లీక్.. 40 మందికి అస్వస్థత!

గ్యాస్ పీల్చి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రభావిత వ్యక్తులు శ్వాస సమస్యలు, వికారం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Gas

Gas

గ్యాస్ లీక్ (Gas Leak) ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సమ్మర్ సమీపిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం మరింత భయాందోళనలు రేపుతోంది. తాజాగా తెలంగాణలోని జనగాం (Jangaon) పట్టణంలోని గీతా నగర్ కాలనీ సమీపంలో క్లోరిన్ గ్యాస్ లీక్ (Gas Leak) అయినట్టు తెలుస్తోంది. అయితే గ్యాస్ పీల్చి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు శ్వాస సమస్యలు, వికారం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు కూడా దగ్గు, తలనొప్పి వంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

చికిత్స పొందిన రోగులతో, బాధిత వారికి తక్షణ వైద్య సహాయం అందించడం జరుగుతోంది. బాధిత వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పట్టణంలోని వాటర్‌ ట్యాంక్‌లో నీటి శుద్ధి కోసం ఏర్పాటు చేసిన క్లోరిన్‌ గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ (Gas Leak) కావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మిషన్ భగీరథ అధికారులు విచారణ చేపట్టారు.

Also Read: DH Srinivasa Rao: వివాదంలో హెల్త్ డైరెక్టర్.. కేసీఆర్ పై భక్తిని చాటుకునేలా ఉత్తర్వులు జారీ!

  Last Updated: 17 Feb 2023, 01:13 PM IST