ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, పోలీసుల శిక్షలు అమలు చేస్తున్నా అత్యాచారాలు జరుతూనే ఉన్నాయి. తెలంగాణలో గ్యాంగ్ రేప్ కారణంగా ఓ మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆగస్టు 14న పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట్ గ్రామంలో మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురై మరణించింది. 15 ఏళ్ల బాలిక వలస కుటుంబానికి చెందినది. తన బంధువులతో కలిసి నిర్మాణ పని కోసం ఇక్కడకు వచ్చింది. పనిలో ఉన్న బాలికను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో నలుగురు నిందితులు ఆమెను అర్ధరాత్రి బంధువులు నివాసముంటున్న గుడిసెల దగ్గర వదిలి పారిపోయారు. ఇంతలో, బాలిక పరిస్థితి విషమంగా ఉందని గమనించిన బంధువులు ఆమెను మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర గాయాలపాలైన బాలికను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా మృతి చెందింది. బాలిక బంధువులు మధ్యప్రదేశ్‌కు వెళ్లే క్రమంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బాలిక సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిందన్న వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
Also Read: Vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు