ఎన్నికల సమయం (TS Polls) దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ (Congress Ticket) ఆశించి భంగపడ్డ నేతలంతా కారెక్కుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలు (కాంగ్రెస్ Leaders) బిఆర్ఎస్ లో చేరగా..తాజాగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) సైతం బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. నర్సాపూర్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్ కుమార్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి (Congress) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గురువారం ఉదయం బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Hairsh Rao) …అనిల్ కుమార్ ను కలిశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్ పూర్‌లోని గాలి అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి బీఅర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గాలి అనిల్ సేవలను బీఅర్ఎస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. తిరిగి బీఅర్ఎస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుని తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానాన్ని స్వాగతించిన గాలి అనిల్ కుమార్ తన కార్యకర్తలతో నర్సాపూర్ లో జరగనున్న ముఖ్యమంత్రి సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని అనిల్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. ఇప్పుడు టికెట్ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్ కావాలని అప్లికేషన్ కూడా పెట్టని వారికి టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు. అప్లికేషన్ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని మొండిచెయ్యి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Balakrishna : టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది – బాలకృష్ణ