టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం (Gajjela Kantham)..కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు చిత్రసీమలోను సంచలనంగా మారాయి. కేటీఆర్ (KTR)ఓ సినీ హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టైంది.
Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!
ఒక హీరోయిన్‌ను అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గరకు తీసుకొచ్చారని, అనంతరం ఆమెను హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌కు తీసుకెళ్లాడని, ఆ ఘటనకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని, తగిన సమయంలో ఆ ఆధారాలను బయటపెడతామని గజ్జెల కాంతం పేర్కొన్నాడు. కేటీఆర్ ఆమెను బెదిరించాడని, ఆ హీరోయిన్ స్వయంగా తమతో చెప్పనట్లు గజ్జెల కాంతం వెల్లడించారు.
ఇకపై కేటీఆర్ చేసిన ప్రతి దురాచారానికి బహిరంగంగా మద్దతుగా నిలబడే వారిని కూడా నిలదీస్తామని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. 2018, 2021 సంవత్సరాల్లో కూడా సినీ నటీమణులతో కేటీఆర్ ఎక్కడెక్కడ తిరిగాడో తమకో తెలుసునని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ అధికారాన్ని మిస్యూస్ చేస్తూ చేసిన చర్యలన్నీ త్వరలో వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నుంచి స్పందన రావాల్సి ఉంది.