సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు గద్దర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక సార్లు గద్దర్ ను ప్రత్యేకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయి. అంతే ఎందుకు వారం రోజుల క్రితం కూడా అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకున్న గద్దర్ ను పవన్ కలిసి వచ్చారు. ఈ సందర్బంగా వారిద్దరూ ఏపీ రాజకీయాల గురించి..భవిష్యత్ రాజకీయాల విషయాల పట్ల మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకరి చేయి ఒకరి పట్టుకొని ఎంతో ఆప్యాయంగా ఉన్నారు.
అలాంటి గద్దర్ (Gaddar) ఇకలేరు అనితెలిసి ఎంతో షాక్ కు గురయ్యారు పవన్. ఏపీలో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ..గద్దర్ ను కడసారి చూడాలని పరుగుపరుగున LB స్టేడియం కు వచ్చి పవన్ గద్దర్ కు నివాళ్లు అర్పించారు. గద్దర్ కొడుకును దగ్గరికి తీసుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు.
గద్దర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు వాయిస్ మెసేజ్ పంపినట్లు పవన్ గుర్తు చేశారు. ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకున్నానని, కానీ, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన్ వర్గాల కోసం పోరాడిన గద్దర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనతో పలు సందర్భాల్లో చాలా సమయం గడిపినట్లు చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి శ్రీశ్రీ తర్వాత గద్దర్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటె గతంలో పవన్ కళ్యాణ్ గురించి గద్దర్ చెప్పిన విషయాలు , వారి మధ్య ఉన్న స్నేహం సంబంధం మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
“పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. పోరాట పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగా ఇష్టపడతాను. నాకు ఆర్థికంగా అవసరం ఉన్న ప్రతిసారి వెళ్లి తనను కలిసాను. పవన్ జేబులో చేయి పెట్టి ఎన్ని డబ్బులు ఉంటే అన్ని తీసుకునే వాడిని. నా జేబులో పెట్టుకునేవాడిని. ఆయనతో నాకు అంత చనువు ఉంది. పవన్ తరచుగా నాకు లెటర్లు కూడా రాస్తాడు. అన్నయ్య బాగున్నవా? చల్లగా బతుకు అని చెప్పేవాడు” అని గద్దర్ తెలిపారు.
https://twitter.com/RusthumHere/status/1688147132308713472?s=20
Read Also : Rahul Gandhi : రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ..