Site icon HashtagU Telugu

Gaddar Awards : రేవంత్ అన్నగారికి థాంక్యూ అని అల్లు అర్జున్ బ్రతికిపోయాడు

Bunny Revanth Gaddar

Bunny Revanth Gaddar

తెలంగాణ ప్రభుత్వం సంస్థాగతంగా ప్రథమంగా అందజేస్తున్న గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards) వేడుక హైదరాబాదు(Hyderabad)లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులను అందించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) మరియు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా పుష్ప-2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకోవడం విశేషంగా నిలిచింది.

Kamal Haasan : అభిమానులపై కమల్ హసన్ ఆగ్రహం

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపైకి రాగానే బాలకృష్ణ, అల్లు అర్జున్‌లను పలకరించడం, వారిని ఆలింగనం చేసుకోవడం కార్యక్రమానికి హైలైట్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు వేదికను అలరించగా, CM చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ అల్లు అర్జున్ తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ‘పుష్ప’ చిత్ర బృందానికి, నా అభిమానులకు కృతజ్ఞతలు. త‌గ్గేదేలే!” అంటూ వేదికపైని సందడిని మ‌రింత పెంచారు.

Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు

ఇదే సమయంలో గతంలో సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇదే తొలిసారి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒకే వేదికపై దర్శనమిచ్చారు. అప్పటినుండి వీరిద్దరి భేటీ జరగకపోయినా, ఈ గద్దర్ అవార్డుల వేదికలో కలుసుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది అభిమానులలో ఆనందాన్ని కలిగించగా, అల్లు అర్జున్‌కు లభించిన అవార్డు ఆయనకు తిరిగి వస్తున్న పాజిటివ్ ఇమేజ్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు.