Site icon HashtagU Telugu

Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Gaddam

Gaddam

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session ) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కేటీఆర్ , ఉత్తమ్ , కడియం , పాడి కౌశిక్ , పద్మ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ప్రమాణం చేసారు. కాగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించి.. ఆయనతో ప్రమాణం చేయించారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించే విషయాన్ని స్పీకర్‌ ప్రకటించనున్నారు. ఆ తరువాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సభాపతి ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో.. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలుపునుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు. 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. గడ్డం ప్రసాద్‌కుమార్‌ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.

Read Also : Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు