Smita Sabharwal : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12న నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై తాజాగా స్మితా సభర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాక..తాను షేర్ చేసిన పోస్టుకుగానూ నోటీసులు ఇచ్చారు ఓకే. అయితే తాను షేర్ చేసిన పోస్టును సోషల్ మీడియాలో 2 వేల మంది వరకు రీషేర్ చేశారు. వారందరిపై సైతం ఇదే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్మితా సబర్వాల్ సూటిగా అడిగారు. ఒకవేళ వారిపై అలాంటి చర్యలు లేవంటే.. తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరూ అతీతులు కాదనేది ఇక్కడ వర్తించడం లేదని స్పష్టమవుతోందని అని స్మితా సభర్వాల్ అడిగారు.
Read Also: CM Revanth Reddy : తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
కాగా, స్మితా సభర్వాల్ మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X హ్యాండిల్ లో పోస్టు చేసిన ఓ ఫోటోను రీపోస్టు చేశారు. కంచ గచ్చిబౌలిలో లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు బుల్డోజర్‌లను, ఒక నెమలి , ఒక జింక గిబ్లి శైలిలో చూస్తున్నట్లు అందులో ఉంది. నోటీసులోని విషయాలను వెల్లడించడానికి పోలీసులు ఇష్టపడటం లేదు. అయితే AI-జనరేటెడ్ చిత్రాన్ని షేర్ చేయడం గురించి BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 179 కింద మేము ఆమెకు నోటీసు ఇచ్చామని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ మీడియాకు తెలిపారు. ఇక, వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోలను స్మితా సభర్వాల్ సోషల్‌మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.