Friendly Police : తెలంగాణలో బ‌రితెగించిన పోలీసులు..సామాన్య ప్రజలపై జులం

పానగల్ మండలం ఎస్ఐ కళ్యాణ్ రావు హౌసింగ్ బోర్డ్ నుండి TS 31D 4445 హుండై అమెజ్ అనే కారుతో అక్కడే యూటర్న్ తీసుకుంటుండగా ఇద్దరూ ఒకరికిఒకరు ఎదుర్పడ్డారు

Published By: HashtagU Telugu Desk
Police Attack

Police Attack

సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన రక్షక భటులు వారే నేరాలకు , దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ (Police Station) వెళ్లిన మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. లంచాలు తీసుకుంటూ అన్యాయం సైడ్ మద్దతు ఇస్తూ నేరస్థులను వదిలేస్తున్నారు. ఇదేంటి అని అమాయకులు అడిగితే పలు కేసులు నమోదు చేసి జైల్లో వేస్తున్నారు. అంతే కాదు తమకు న్యాయం జరగడం లేదని ఆందోళన చేస్తే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. అంతెందుకు రాంగ్ రూట్లలో ఎవరైనా వస్తే వారికీ ఫైన్ లు వేసి..సరైన రూట్లలో వెళ్లాలని చెప్పాల్సిన పోలీసులు..వారే రాంగ్ రూట్లో వస్తూ..ఎదురుగా వచ్చిన మరో వాహన దారుడిపై దాడికి తెగబడుతున్నారు. ఇలా ప్రతి రోజు ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ లో అదే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

తన కారుకు ఎదురుగా వచ్చాడన్న కోపంతో ఓ బైకర్ పై దాడి చేసి బూట్ కాళ్లతో ఎస్ఐ తొక్కిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నాగర్ కర్నూల్ ( NagarKurnool) జిల్లా కేంద్రానికి చెందిన మిడిదొడ్డి రంజిత్ (Ranjeeth) అనే వ్యక్తి ఇంటికి వెళుతున్న క్రమంలో శాన్వి ఆసుపత్రి ముందు తన ఇంటి వైపు వెళ్లే క్రమంలో పానగల్ మండలం (Pangal Mandal) ఎస్ఐ కళ్యాణ్ రావు (SI Kalyan Rao) హౌసింగ్ బోర్డ్ నుండి TS 31D 4445 హుండై అమెజ్ అనే కారుతో అక్కడే యూటర్న్ తీసుకుంటుండగా ఇద్దరూ ఒకరికిఒకరు ఎదుర్పడ్డారు. అయితే తన కారుకు అడ్డంగా నిలిపాడని బైక్ పై వచ్చిన అతనితో ఎస్ఐ వాదనకి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఎస్ఐ కారులో నుంచి దిగి బైక్ పై వచ్చిన వ్యక్తి మీద దాడి చేశాడు. నడిరోడ్డుపై కిందపడేసి పిడిగుద్దులు కురిపించాడు.. మరియు స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి మరోసారి దాడి జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన ఫై స్థానికులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఏ ఆపద వచ్చిన ..ఏ తప్పు చేసిన సరిచేయాల్సిన పోలీసులే..అన్యాయంగా కొడుతున్నారని..కేసులు పెడుతున్నారని..ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి ఎక్కువయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : LIC Jobs : ఎల్‌ఐసీలో 200 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు

  Last Updated: 30 Jul 2024, 01:39 PM IST