Drugs Congress : డ్ర‌గ్స్ స్కామ్ పై `కాబోయే పీసీసీ` చీఫ్ వార్‌

డ్ర‌గ్స్ కేసు(Drugs case) మూలాల‌పై మ‌రోసారి కాబోయే పీసీసీ చీఫ్ (ఇటీవ‌ల ఆయ‌న ఖరారు చేసుకున్న ప‌ద‌వి) బ‌క్కా జ‌డ్స‌న్ దృష్టి పెట్టారు.

  • Written By:
  • Updated On - December 17, 2022 / 04:42 PM IST

డ్ర‌గ్స్ కేసు(Drugs case) మూలాల‌పై మ‌రోసారి కాబోయే పీసీసీ చీఫ్ (ఇటీవ‌ల ఆయ‌న ఖరారు చేసుకున్న ప‌ద‌వి) బ‌క్కా జ‌డ్స‌న్ దృష్టి పెట్టారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 17వ తేదీ ఈడీకి ఫిర్యాదు చేసిన ఆయ‌న మ‌ళ్లీ దాన్ని తిర‌గ‌దోడుతున్నారు. బెంగుళూరు, తెలంగాణ డ్ర‌గ్స్ కేసు(Drugs case) ల‌పై సిట్ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ను విచారించాల‌ని ఈడీ(ED Office)కి చేసిన ఫిర్యాదులోని ప్ర‌ధాన డిమాండ్‌. ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదును ప‌క్క‌న ప‌డేసిన ఈడీ(ED Office) ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇవ్వ‌డాన్ని రాజ‌కీయ కోణం నుంచి జ‌డ్స‌న్ చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను డ్రగ్స్ కేసు(Drugs case)లో ప్రధమ ముద్దాయిగా గుర్తించాల‌ని కోరుతున్నారు. ఒక వేళ ఆయ‌న్ను విచార‌ణ‌కు పిలవ‌క‌పోతే ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

మంత్రి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ ను బ‌క్కా జ‌డ్స‌న్ విసిరారు. ఆ ఛాలెంజ్ ను స్వీక‌రించి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకుంటే మంత్రి కేటీర్ ను ‘డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్’గా గుర్తిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అలాగే, కవిత ను లిక్కర్ అంబాసిడర్’గా ప్ర‌క‌స్తామ‌ని జ‌డ్స‌న్ మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. తెలంగాణ రాష్టం లో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోతుందని ఆందోళ‌న చెందారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా మూలాలు తెలంగాణ లో ఉంటున్నాయ‌ని అన్నారు. మంత్రి కేటీఆర్ కు. ‘వైట్ ఛాలెంజ్’ విసిరిన జ‌డ్స‌న్ రక్తం, గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి దగ్గర కు వెళ్తుంటే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ ఆయ‌న్ను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ స్కామ్ లో  సినీ నటులను

డ్రగ్స్ స్కామ్ లో కొందరు సినీ నటులను రక్షించేందుకు కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. ఆ విష‌యం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా వంటి తారలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోన్ చేసిన తీరును బట్టి స్పష్టమవుతుంద‌ని అన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇదే తరహాలో విచారణ జరిపినప్పుడు ప్రముఖుల జాబితాలో వాళ్లు లేరని గుర్తు చేశారు. రెండేళ్ల పాటు డ్ర‌గ్స్ కేసును విచారించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ చివ‌ర‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. విచార‌ణ‌కు సంబంధించిన నివేదిక‌ల‌ను హైకోర్టు అడిగిన‌ప్ప‌టికీ అందించ‌లేదు.

తెలంగాణ డ్ర‌గ్స్ కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం క‌లిగించింది. కార్పొరేట్ కాలేజిలు, స్కూల్స్ తో పాటు టాలీవుడ్ తార‌లు కొంద‌రు డ్ర‌గ్స్ స్కామ్ లో ఉన్నార‌ని తొలుత అనుమానించారు. ఆ మేర‌కు వంద‌లాది మందికి నోటీసులు ఇవ్వ‌డం ద్వారా విచార‌ణ జ‌రిపారు. ప్ర‌ధాన నిందితుడు డ్ర‌గ్ల‌ర్ కెల్విన్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు విచార‌ణ సాగించారు. కానీ, హ‌ఠాత్తుగా ఆ కేసు బుట్ట‌దాఖ‌లు కావ‌డం విచిత్రంగా మారింది. అదే విష‌యాన్ని ఇప్పుడు బ‌క్కా జ‌డ్స‌న్ బ‌య‌ట‌కు తీస్తున్నారు. గ‌తంలో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదును గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ను విచార‌ణ‌కు పిల‌వాల‌ని డిమాండ్ చేయ‌డం రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది. మ‌నీ ల్యాండ‌రింగ్ కు పాల్ప‌డ్డార‌ని ఇప్ప‌టికే క‌విత మీద జ‌డ్స‌న్ ఫిర్యాదు చేసిన విదిత‌మే. క‌ల్వకుంట్ల కుటుంబం ఆస్తుల మీద కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లకు ఫిర్యాదు చేశారు. ఇటీవ‌ల `లైగ‌ర్‌` సినిమా పెట్టుబ‌డుల‌పై ఫిర్యాదు చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

Drugs Kingpin Arrested: కీలక ఘట్టం.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.!