Free Bus Scheme : మహిళలకు బస్సు జర్నీ ఫ్రీ.. అలా చేయకుంటే రూ.500 ఫైన్

Free Bus Scheme : శనివారం (డిసెంబర్ 9) నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.

Published By: HashtagU Telugu Desk
Free Bus Ride

Free Bus Ride

Free Bus Scheme : శనివారం (డిసెంబర్ 9) నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలోని ప్రతి మహిళ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా జర్నీ చేయొచ్చు. సిటీలు, పల్లెలూ అని తేడా లేదు. బస్సు ఎక్కిన మహిళలు కండక్టర్‌కు ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. అక్కడి మహిళలు ఆధార్ కార్డ్ చూపించినప్పుడు, దానిపై ఉన్న నంబర్‌ను కండక్టర్ నమోదుచేసుకొని టికెట్ ఇస్తున్నారు. తద్వారా కండక్టర్ ఎలాంటి మోసాలకూ పాల్పడే అవకాశం ఉండదు. ఎక్కడైనా టికెట్ చెకింగ్ ఆఫీసర్లు బస్సును చెక్ చేస్తే.. టికెట్ లేని వారికి రూ.500 ఫైన్ వేస్తారు. మహిళలు టికెట్ తీసుకుంటున్నారు కాబట్టి వారికి ఫైన్ పడదు.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణాటక తరహా ఫ్రీ బస్సు ప్రయాణం విధానమే తెలంగాణలోనూ అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కిన తర్వాత మహిళలు ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవాలి. బస్సు దిగే వరకు టికెట్‌ని తమ దగ్గరే ఉంచుకోవాలి. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం అమలులో  ఎదురయ్యే సాంకేతిక సమస్యలను త్వరలోనే సమీక్షించి.. అవి తొలగిపోయేలా(Free Bus Scheme)  ఏర్పాట్లు చేయనున్నారు.

  Last Updated: 08 Dec 2023, 09:11 AM IST