Site icon HashtagU Telugu

Hyderabad Double Decker : డబుల్ డెక్కర్ బస్సులో ఉచిత ప్రయాణం…

free hyderabad double decker bus

free hyderabad double decker bus

నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది HMDA . 1946లో నిజాం VII మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిజాం ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ద్వారా మొదటిసారి హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు (Double Decker BUS) ప్రవేశపెట్టబడ్డాయి. 30 ఆల్బియాన్ సిఎక్స్ 19 మోడళ్ల సెట్‌ను ఇంగ్లండ్ నుండి హైదరాబాద్‌(Hyderabad)కు తీసుకువచ్చారు. 56-సీట్ల సామర్థ్యం గల బస్సులు సముద్రం ద్వారా వివిధ భాగాలలో రవాణా చేయబడ్డాయి, హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్ వాటిని తిరిగి నగరంలోకి చేర్చింది. డబుల్ డెక్కర్ బస్సులు ఒకప్పుడు సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మధ్య అనేక మార్గాల్లో నడిచేవి. ఫ్లై ఓవర్ల నిర్మాణం, పెరుగుతున్న నష్టాలు, అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా 2003లో దశలవారీగా నిలిపివేయబడింది.

We’re now on WhatsApp. Click to Join.

అప్పటి నుండి డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. ఇటీవల వీటిని మళ్లీ రోడ్ల మీదకు తీసుకొచ్చింది HMDA . కొత్తగా వీటిని కొనుగోలు చేసిన HMDA .. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టు మాత్రమే ఇవి పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక ఇందులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఈమధ్య అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు చేసిన తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ చాలా పెరిగిపోయింది. నగరంలో ఉండేవాళ్లు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు అలాగే విదేశీ టూరిస్టులు సైతం.. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సాగర్‌ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.

ప్రస్తుతం సాగర్‌ చుట్టూ ఈ మూడు బస్సులు తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్‌ పార్కు, జలవిహార్‌, నీరాకేఫ్‌, పీపుల్స్‌ప్లాజా, అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి మళ్లీ బస్సుల్లోనే ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లొచ్చు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కుకు ఈ బస్సులు చేరుకొంటాయి.

Read Also : Diwali 2023 : హైదరాబాద్లో 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి