Site icon HashtagU Telugu

Telangana: 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి

Telangana

Telangana

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ రోజు మొదటి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించారు. కాగా ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నెల 9న రెండు హామీలను అమలు చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వచ్చే ఐదేళ్లలో ప్రజలు కోరుకుంటున్న మార్పును చూపిస్తామని స్పష్టం చేశారు. కేబినెట్‌లో ఆరు హామీలపై చర్చించామని చెప్పిన ఆయన రేపు 2 హామీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనున్నారు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలి. శ్వేతపత్రం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Also Read: Cyclone Michuang: రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన