Free Bus Service : ఉచిత బస్సు ప్రయాణం ఫై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు..

అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలను నెరవేర్చి మాట నిలుపుకునే ప్రభుత్వం అని యావత్ తెలంగాణ ప్రజల చేత అనిపించుకుంటుంది

Published By: HashtagU Telugu Desk
Bus Free

Bus Free

మాట ఇచ్చామంటే.. చేసి తీరుతామని.. మరోసారి కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో (Congress 6 Guarantees) రెండు హామీలను నెరవేర్చి మాట నిలుపుకునే ప్రభుత్వం అని యావత్ తెలంగాణ ప్రజల చేత అనిపించుకుంటుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. పేదల కష్టాలను తీర్చే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. నేడు రెండు పథకాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy).. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు.

రాష్ట్రంలో ఉన్న అందరికీ మెరుగైన వైద్యం అందాలన్న ఆలోచనతోనే (Cheyutha Scheme) రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర నలుమూలల్లో ఉన్న ఆడబిడ్డలు పైసా ఖర్చు లేకుండా బస్సు ప్రయాణం చేయాలనే మహాలక్ష్మీ పథకాన్ని (Mahalakshmi Scheme ) అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మీ పథకం అమలు చేయడం ఫై యావత్ రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం లో బస్సు ఎక్కాలంటే భయం వేసేదాని, చార్జీల తో అధిక భారం అయ్యేదని, ఎక్కడికి వెళ్లాలన్న కేవలం ఇంటి పెద్ద వారు ఒక్కరు మాత్రమే వెళ్లేవారని..ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది ఫ్రీ బస్సు సర్వీస్ వచ్చిందని ఇక శుభకార్యమైన, అశుభకార్యమైన, వేడుక ఏదైనా సరే కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లొచ్చని..ఆ అవకాశం రేవంత్ అన్న వచ్చిన రెండు రోజుల్లో కల్పించారని వారంతా సంతోషం తెలుపుతున్నారు. ఈ పథకాన్ని ఇలాగే ఐదేళ్ల పాటు కొనసాగించాలని..మిగతా నాల్గు పథకాలు కూడా 100 రోజుల్లోపే నిరవేర్చాలని వారంతా కోరుకుంటూ జై రేవంత్..జై కాంగ్రెస్ అంటున్నారు.

Read Also : PM Modi: సోనియాగాంధీకి మోడీ బర్త్ డే విషెస్

  Last Updated: 09 Dec 2023, 02:56 PM IST