Site icon HashtagU Telugu

Frag in Beer : బీరు బాబులు..కాస్త చూసుకొని తాగండి..లేదంటే అంతే సంగతి ..!!

Frag In Beer

Frag In Beer

బీర్ (Beer) అంటే చాలు చాలామంది ఎంతో ఇష్టపడుతుంటారు..ఒకప్పుడు కేవలం మగవారు మాత్రమే బీర్లను ఎక్కువగా తాగేవారు..కానీ ఇప్పుడు ఆడ, మగ అందరు తాగేస్తున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే బీర్ల కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎండా వేడి ని తట్టుకునేందుకు చాలామంది బీర్లనే తాగేస్తుంటారు. అయితే ఇటీవల బీర్ల తాగాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించి..బీరు సీసాను కిందకు పైకి స్కాన్ చేసి తాగుతున్నారు..ఎందుకంటే ఈ మధ్య బీర్ల లో బల్లులు , మిడతలు, నాసు, వానపాములు,గుట్కా ప్యాకెట్ లు ఇలా అనేకమైనవి బయటపడుతున్నాయి. దీంతో చాలామంది బీరు తాగాలంటే ఖంగారుపడుతున్నారు.

తాజాగా బీరులోక‌ప్ప (Frag ) క‌లేబ‌రాలు బయటపడిన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో చోటుచేసుకుంది. జిల్లాలోని డొంకేశ్వ‌ర్ మండ‌ల కేంద్రంలోని వైన్ షాపులో చల్లగా ఓ బీరు తాగుదామని చెప్పి..వైన్ షాప్ కు వెళ్లి చల్లని బీరు తీసుకోని.. కాస్త స్ట‌ఫ్ తీసుకుని కూర్చుని బీర్ ఓపెన్ చేశాడు. అంతే అందులో క‌ప్ప క‌ళేబ‌రాలు క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. ఇది చూసి వెంటనే వైన్ షాపు య‌జ‌మానిని నిలదీసాడు..మాకు ఏంతెలుసు..తయారీ దగ్గరే ఆలా పడి ఉంటుంది..మాకు ఏంతెలియదని సదరు వైన్ షాప్ యజమాని చెప్పడం.. అధికారుల‌కు ఫిర్యాదు చేసాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా బీరు తాగేముందు చెక్ చేసుకొని తాగాలని మాట్లాడుకుంటున్నారు.

Read Also : YS Sharmila: మ‌రోసారి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల‌..!