కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read: 9 Injured : నోయిడా ఎయిర్‌పోర్ట్ వద్ద పేలిన సిలిండర్.. 9 మందికి గాయాలు
మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హనుమకొండ జిల్లాకు కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెళ్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.