Formula E-Car race : ఫార్ములా ఈ-కార్ రేసు..పలు కీలక విషయాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నాయని.. ఇవన్నీ 2022 ఏప్రిల్ 8 - అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Formula e-car race.. Telangana government has revealed many important things

Formula E-Car race :  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలను బయటపెట్టింది. ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆరెస్స్ కు కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నాయని.. ఇవన్నీ 2022 ఏప్రిల్ 8 – అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇక, ఫార్ములా ఈ-రేస్ కు సంబంధించిన చర్చలు మొదలు అయినప్పటి నుంచే బాండ్లను కొనుగోలు చేసిందట గ్రీన్ కో సంస్థ. అయితే రేవంత్‌ ప్ర‌భుత్వం కావాల‌ని లీక్ చేసిన ఫార్మూలా కేసులో అంశాల‌పై చిట్ చాట్ లో కేటీఆర్‌ స్పందించారు. గ్రీన్ కో ఇచ్చిన బాండ్లు 2022లో ఫార్మూలా రేసు జ‌రిగింది..2023లో అని వెల్లడించారు. ఫార్మూలా రేసు వ‌ల్ల గ్రీన్ కో ల‌బ్ధి చేకూర‌లేదు స‌రిక‌దా గ్రీన్ కో న‌ష్ట‌పోయిందన్నారు. ఎన్నిక‌ల బాండ్ల విధానం తెచ్చింది కేంద్రం. అన్ని పార్టీల‌కు వ‌చ్చిన‌ట్లే బీఆర్ఎస్ కు వ‌చ్చాయని వివరించారు. చ‌ర్చ‌కు వారు రెడీ అయితే మేం కూడా రెడీ అంటూ చిట్‌ చాట్‌ లో కేటీఆర్‌ తెలిపారు.

రైతు భరోసా ఎగ్గొట్టారని.. దాని నుంచి దారి మళ్లించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని.. ఇలాంటి నాటకాలకు భయపడమని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా… రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకూ కొట్లాడతామని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. తనను అడుగుతున్న సమాచారం అంతా ప్రభుత్వం వద్దే ఉందని.. గతంలో ఓ మంత్రిగా ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తన వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారని.. తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఈ రోజు ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కు అని కేటీఆర్‌ అన్నారు.

Read Also: Mohan Babu : జర్నలిస్ట్‌పై దాడి కేసు.. సుప్రీంకోర్టులో మోహన్ బాబు‌కు షాక్

 

 

  Last Updated: 06 Jan 2025, 02:41 PM IST