Formula E Car Race : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై ఒకటి, రెండు రోజుల్లోగా ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఎందుకంటే.. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో ఆయనపై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చేశారు. గవర్నర్ అనుమతి వివరాలను తెలంగాణ ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం డిసైడ్ చేసింది.
Also Read :Heart: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదు? మీకు తెలుసా..!
కేటీఆర్‌పై కేసు నమోదు కోసం ఏసీబీకి అనుమతి మంజూరు చేసే అంశంపై సోమవారం రోజు అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా రేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏకు ఛైర్మన్‌గా ఉండే సీఎం అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం.. ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల విదేశీ కరెన్సీని చెల్లించడంపై డిస్కస్ చేశారు. ఈ డబ్బులను ముందుగా చెల్లించి, రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకోవడంపైనా చర్చించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అప్పట్లో ఈ ఒప్పందం చేసుకున్నారనే అంశం కూడా ఈసందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.
Also Read :Travel Tips : మీరు ఆన్‌లైన్‌లో హోటల్ లేదా గదిని బుక్ చేస్తుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోండి
సదరు మంత్రి సూచన మేరకే ఫార్ములా రేసు(Formula E Car Race) నిర్వాహక సంస్థకు డబ్బులను చెల్లించానని నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరణ ఇచ్చారని ఈసందర్భంగా మంత్రివర్గానికి సీఎం తెలిపారు. హెచ్‌ఎండీఏ చెల్లించిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తేలాలంటే ఏసీబీ దర్యాప్తు ఒక్కటే మార్గమనే అభిప్రాయానికి రాష్ట్ర మంత్రిమండలి వచ్చినట్లు తెలిసింది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని.. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇచ్చారని, అందుకే ఇంత జాప్యం జరిగిందని సీఎం తెలిపారు. ఈమేరకు అభియోగాలతో రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్, పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా ప్రస్తావించారు. అధికారులపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. తాజాగా కేటీఆర్‌పై కేసు నమోదుకు పచ్చజెండా ఊపింది.