former MLA Shakeel : ధాన్యం స్కామ్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్..

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 07:27 PM IST

అధికారం చేతిలో ఉంటె ఎన్ని ఆటలైన ఆడొచ్చు..ఒన్స్ అధికారం పోయిందా..ఇక అసలైన అట అధికార పార్టీ మొదలుపెడుతుంది. ప్రస్తుతం తెలంగాణ లో అదే జరుగుతుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు..ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందినకాడికి దోచేశారు..ఇక ఇప్పుడు దోచేసిన దాన్ని బయటకు తీసే పని పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బిఆర్ఎస్ మాజీ మంత్రులను , ఎమ్మెల్యే లను టార్గెట్ గా పెట్టుకొని వరుస షాకులు ఇస్తుంది.

ఇప్పటికే ఆర్మూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) వరుస షాకుల మీద షాకులు తగులుతుంటే..తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) కు భారీ షాక్ తగిలింది. షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం (CMR Rice) మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

షకీల్ కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇక.. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్, ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూ ర్వకంగా రాసిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2 వేల మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాకకు ఇచ్చారు. ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు అడగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటె ఇక మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు అయింది. శామీర్ పేట ఎమ్మార్వోతోపాటు, మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా బిఆర్ఎస్ నేతలందరికీ వరుస షాకులు తగులుతున్నాయి. మరి ఇంకెంతమందికి షాక్ ఇస్తారో చూడాలి.

Read Also : Drugs : డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..