KCR : కేసీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..

KCR : బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కర్నె ప్రభాకర్‌తో పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు స్వయంగా ఫామ్‌హౌస్‌కు వెళ్లారు

Published By: HashtagU Telugu Desk
Kcr Laxmareddy

Kcr Laxmareddy

ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ (KCR) మీడియా ముందుకు రావడం చాల వరకు తగ్గించాడు. ఎప్పుడో కానీ మీడియా కంటపడడంలేదు. కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harish Rao) లు మాత్రం పార్టీ వ్యవహారాలను ముందుండి చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ సమస్యలపై కేటీఆర్ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎక్కువగా కేటీఆర్ రియాక్ట్ అవుతూ..ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మధ్యనే పాలకుర్తి నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చారు. మళ్లీ కనిపించలేదు. తాజాగా ఈరోజు మరోసారి తళుక్కున మెరిశారు. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కర్నె ప్రభాకర్‌ (Charlakola Lakshmareddy, Srinivas Goud, Karne Prabhakar)తో పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు స్వయంగా ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా వారికి స్వాగతం పలికారు. లక్ష్మారెడ్డిని కౌగిలించుకుని కుశల ప్రశ్నలు అడిగారు. అనంతరం వారితో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ కూడా అక్కడే ఉన్నట్లు వీడియోలలో కనిపిస్తుంది.

Read Also : Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్

  Last Updated: 16 Nov 2024, 08:10 PM IST