Site icon HashtagU Telugu

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Jagadish Reddy

Safeimagekit Resized Img (3) 11zon

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర‌దృష్ట‌వశాత్తు ప‌రిపాల‌న అనేదే అడ్ర‌స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌ట‌మే స‌రిపోతుంద‌న్నారు. అధికారులు ఎవ‌రి ప‌నుల్లో వారే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను మాత్రం గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. సాగునీటి నిర్వ‌హణ‌, తాగు నీటి నిర్వ‌హ‌ణ అధ్వానంగా త‌యారైంద‌ని అన్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. 2014కు ముందు నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాష్ట్రంలో చూస్తాన‌మ‌న్నారు. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందని, సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమ‌ర్శించారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

తెలంగాణ‌లో అవినీతికి పాల్ప‌డి ఢిల్లీకి డ‌బ్బు పంపే ప‌నిలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బిజీగా ఉంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్టి వారికి తాగునీరు అందించేలా కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ బ‌య‌టికి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్ల‌ను బ‌య‌ట‌కు వదిలార‌ని మాజీ మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే వాట‌ర్ ట్యాంకుల‌ను తనిఖీ చేసే స‌మ‌యం కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కానీ అధికారులు కానీ లేద‌న్నారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

We’re now on WhatsApp : Click to Join

Exit mobile version