Site icon HashtagU Telugu

Telangana: సీఎం రేవంత్ ని కలిసిన బొంతు రామ్మోహన్

Bonthu Rammohan Met With Revanth

Bonthu Rammohan Met With Revanth

Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు వరుస షాక్​లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కీలక వ్యక్తి చేరారు. కారు పార్టీపై కొంతకాలంగా అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వివరాలలోకి వెళితే…

గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ దృష్టి సారించింది. నగరంలో పట్టు సాధించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతమైంది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌పై బొంతు రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఉప్పల్‌ నియోజకవర్గం టికెట్‌ ఆశించిన బొంతు రామ్‌మోహన్‌ నిరాశ చెందారు . బండారు లక్ష్మారెడ్డికి నియోజకవర్గం టికెట్‌ కేటాయించడంతో బొంతు రామ్‌మోహన్‌ అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ నుంచి మరోసారి పార్లమెంట్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. లోక్ సభ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం కాగా బొంతు రామ్మోహన్‌ కాంగ్రెస్ తరుపున మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్టు సమాచారం.

Also Read: MLA Sreedhar Reddy : లోకేష్ ను సర్పంచ్ కాదు కదా.. వార్డు మెంబర్ గా కూడా గుర్తించలే – వైసీపీ ఎమ్మెల్యే