Site icon HashtagU Telugu

Boga Sravani: కమలం ఆకర్ష్.. బీజేపీలో చేరిన బోగ శ్రావణి!

Bjp

Bjp

జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐదు రోజుల తర్వాత తన భర్త ప్రవీణ్‌తో కలిసి బీజేపీ లో చేరారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. శ్రావణి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇటీవల జగిత్యాలలో శ్రావణిని కలిసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తనను చాలాసార్లు అవమానించారని, బీఆర్‌ఎస్ హైకమాండ్ తన ఫిర్యాదును పట్టించుకోలేదని, తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని శ్రావణి చెప్పారు.

ఒకవైపు బీఆర్ఎస్ (BRS Party) పార్టీ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ.. పార్టీ విస్తరణపై ద్రుష్టి సారిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ గ్రూప్ విభేదాలపై ఇతర పార్టీలు గురి పెడుతున్నాయి. బయటకొచ్చిన నేతలంతా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) తో టచ్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అయిన ఈటల రాజేందర్ (Etala Rajendar) జగిత్యాలలోని శ్రావణి ఇంట్లో కలుసుకున్నారు.

శ్రావణి (Sravani)కి సంఘీభావం తెలిపి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. అసెంబ్లీ పవిత్ర స్థలమని, బీఆర్‌ఎస్ డర్టీ పాలిటిక్స్ కు పాల్పడుతోందని రాజేందర్ అన్నారు. కేసీఆర్ హయాంలో వెనుకబడిన, ఎస్సీ వర్గాలకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్యాయం జరిగిందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ గొడవే అందుకు చక్కటి ఉదాహరణ అని అన్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం సీఎంను పొగడడానికే ఉన్నారని, ప్రజా సమస్యలను వినే స్థితిలో లేరని రాజేందర్ (Etala Rajendar) అన్నారు.

Also Read: Sudheer Babu Look: సుధీర్ బాబు ఏంటీ.. ఇలా మారిపోయాడు!