Site icon HashtagU Telugu

Former BRS MLA: బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్

Patnam Narendra Reddy

Patnam Narendra Reddy

Former BRS MLA: వికారాబాద్ జిల్లా దుద్యాల మండ‌లంలోని లగచర్ల గ్రామంలో క‌లెక్ట‌ర్ దాడి ఘటనలో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని (Former BRS MLA) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో నరేందర్‌రెడ్డి అనుచరుడైన ప్రధాన నిందితుడు సురేష్ దాడి సమయంలో ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈ కేసు సంబంధించి ఆయన్ను విచారించనున్నారు. విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యేను కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్ప‌టికే 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఐజీ తెలిపారు. మరో 10 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. క‌లెక్ట‌ర్‌పై దాడి కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఐజీ తెలిపారు. ప్ర‌స్తుతం వికారాబాద్ ఎస్పీ ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్న‌ట్లు స‌మాచారం. ఎస్పీ ఆఫీస్‌లో విచారణ అనంతరం పరిగి డీఎస్పీ ఆఫీస్ కు పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు తీసుకెళ్లి అక్క‌డ కూడా విచారించనున్నట్లు పరిగి డీఎస్పీ కరుణ సాగర్ రెడ్డి తెలిపారు. క‌లెక్టర్, అధికారులపై దాడి కేసులో 100 మందికిపైగా వ్యక్తులను గుర్తించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన కుట్రదారు పట్నం అనుచరుడు సురేష్ రాజ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్నం నరేందర్ ఆదేశాలతో సురేష్ రాజ్ దాడులకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

Also Read: Samantha : షూటింగ్ లో స్ప్రుహ తప్పిపడిపోయిన సమంత..!

మ‌రోవైపు క‌లెక్ట‌ర్‌పై దాడిని ప్ర‌భుత్వం చాలా సిరీయ‌స్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ సైతం ఈ ఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలమని చెప్పారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా అని ప్ర‌శ్నించారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదని ప్ర‌శ్నించారు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..? అంటే దాడులను ప్రోత్సహించేందుకె ప‌రామ‌ర్శ‌లా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.