Site icon HashtagU Telugu

Hydra : ‘హైడ్రా’ పేరుతో వసూళ్లకు పాల్పడేవారిపై ఫోకస్ పెట్టండి – సీఎం రేవంత్

Cm Revanth Reddy (10)

Cm Revanth Reddy (10)

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా హైడ్రా (Hydra ) పేరు మారుమోగిపోతుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ (CM Revanth Reddy) హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా వందలమందికి నోటీసులు జారీ చేసారు. ఈ క్రమంలో కొంతమంది కేటుగాళ్లు హైడ్రా పేరు చెప్పి అమాయకపు ప్రజల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. మీ ఇల్లు అక్రమ నిర్మాణంలో ఉంది..హైడ్రా నోటీసుకు మీ పేరు వచ్చింది. మీ ఇల్లు కూల్చకుండా ఉండాలంటే మాకు కొంత డబ్బు చెల్లించుకోవాలి..లేదంటే మీ ఇల్లు కూల్చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడం తో అలాంటివారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. తాజాగా హైడ్రా పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

Read Also : Mutton Fight Viral : మటన్ ముక్క ఎంత పనిచేసింది..!!

Exit mobile version