Site icon HashtagU Telugu

Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

Deputy CM Bhatti

Deputy CM Bhatti

Deputy CM Bhatti: ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం పడకుండ ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయంగా ఆదాయం పెంపు పైన అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై పలు కీలక శాఖలతో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదాయం పెంపు పైన జరిగే సమావేశానికి నూతన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని రావాలని సూచించారు.

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు  పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు. అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలో సబ్ యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు.  ఎల్ఆర్ఎస్ పథకంలో వేగం పెంచాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు.. ఇప్పటివరకు సమకూరిన ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ద్వారా ఏ మేరకు ఆదాయం అంచనా వేయవచ్చు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Hyderabad : ‘హైడ్రా’ దెబ్బ కు తలలు పట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు

హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు .. అసైన్డ్ భూములు.. కోర్టు వివాదాలను సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావద్దని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒకటి. ఈ అంశంలో లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, ఎం ఏ యు డి ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ కమిషనర్ ఎస్.ఎం ఏ రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ , రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతం, మైనింగ్ శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ సుశీల్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.