Site icon HashtagU Telugu

TS Elections: తెలంగాణలో తొలి ఫలితం ఔట్, కాంగ్రెస్ అభ్యర్థి విజయం!

Ahswarao

Ahswarao

TS Elections: అందరూ ఊహించినట్టుగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్తులు ఇతర పార్టీల కంటే ముందుంటూ సవాల్ విసురుతున్నారు. ఇక లీడ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ముందు వరుసలో నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలి ఫలితం వెలువడింది.  ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు.

కాంగ్రెస్ అభ్యర్థి 28,356 ఓట్ల తో ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి బోణి కొట్టింది.  అంతేకాదు.. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోతుండటంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్ద సంబురాలు మొదలయ్యాయి. ఇక ఆయన ఇంటికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు.

తెలంగాణ 119 నియోజకవర్గాలు…||

◻️ 104/119

◻️ కాంగ్రెస్ – 60 స్థానాల్లో ముందంజ…
బిఆర్ఎస్ – 34 స్థానాల్లో ముందంజ…
బిజేపి – 9 స్థానాల్లో ముందంజ…
సిపిఐ – 1 స్థానంలో ముందంజ…
ఎంఐఎం – 1 స్థానంలో ముందంజ…
ఇతరులు – 0 స్థానంలో ముందంజ…

Also Read: Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!