Site icon HashtagU Telugu

Telangana Govt : ఫస్ట్ ఆ మూడు జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులు

Telangana Ration Cards Update New Family Members Addition

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) మంజూరు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల 26న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయగా, తర్వాత ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కొన్ని జిల్లాల్లో అంతరాయం ఏర్పడింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల (MLC Elections) నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ కార్డుల జారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు.

Jagan No Comments : అరే..జగన్ నోటి వెంట పవన్ పేరు రాలేదే?

ఈ పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మాత్రం రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అనుమతిస్తూ తగిన సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో లేని రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో (Ranga Reddy, Hyderabad and Mahabubnagar Districts) తొలుత రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. అధికారులంతా అవసరమైన ఏర్పాట్లు చేసి కొత్త కార్డులను లబ్ధిదారులకు త్వరితగతిన అందించేందుకు సిద్ధమవుతున్నారు.

BJP : నాగబాబు రుణం తీర్చుకోబోతున్న బిజెపి..?

కొత్త రేషన్ కార్డులు ఆధునికమైన బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇవి పోస్ట్ కార్డు సైజులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత కార్డులను కలిపి మొత్తం కోటి రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రేషన్ కార్డులపై ఒక వైపున ముఖ్యమంత్రి ఫోటో, మరో వైపున పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోతో పాటు ప్రభుత్వ లోగోను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు త్వరితగతిన అందేలా ఈ కార్డులను మంజూరు చేయనున్నారు.