మూడోసారి సీఎం కావడానికి సీఎం కేసీఆర్ (First list Ready) వ్యూహాలను రచిస్తున్నారు. సంపూర్ణంగా సర్వేల మీద ఆధారపడ్డారు. కనీసం 15మంది సిట్టింగ్ లకు హ్యాండివ్వనున్నారని తెలుస్తోంది. గ్రాఫ్ ప్రకారం మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆషాఢమాసం తరువాత 70 నుంచి 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించబోతున్నారు. అందుకు సంబంధించిన ముహూర్తాన్ని పెడుతున్నారని ప్రగతి భవన్ వర్గాల్లోని టాక్.
మూడోసారి సీఎం కావడానికి సీఎం కేసీఆర్ వ్యూహాలను.,(First list Ready)
ఒక్కో ఎన్నికకు ఒక్కోలా వ్యూహం ఉంటుందని సీఎం కేసీఆర్ చెబుతుంటారు. గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చిన సీఎంగా రికార్డ్ సృష్టించారు. మూడోసారి సీఎం కావడానికి సరికొత్త వ్యూహాన్ని ఆయన రచించారు. తెలుస్తోంది. పక్కా సర్వేల ఆధారంగా టిక్కెట్ల ఇవ్వాలని (First list Ready) నిర్ణయించుకున్నారు. పలు కోణాల నుంచి ప్రైవేటు, ప్రగతి వర్గాల అంచనాలను క్రోడీకరించడం ద్వారా ఒక నిర్థారణకు వచ్చారు. ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోన్న మాట.
సర్వేలను బేస్ చేసుకుని 15శాతం మంది సిట్టింగ్ లను తొలగించబోతున్నారు
మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను, 7 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్ పెడుతున్నారట. ఆ ఏడు స్థానాల్లో ఎంఐఎంకు అనుకూలంగా శ్రేణులు పనిచేస్తాయి. గత ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీతో సహజ మిత్రత్త్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ చతురతను కేసీఆర్ ప్రదర్శించారు. ఈసారి అందుకు భిన్నంగా కేవలం 7 స్థానాల్లో మాత్రమే కాకుండా 45 స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే, కాంగ్రెస్ పార్టీ బ్యాంకును భారీగా ఎంఐఎం చీల్చుకోనుంది. ఫలితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు దిశగా (First list Ready) పయనించనున్నారు. ఇదే, ఈసారి ఎన్నికల్లోని కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ.
ఆషాడం ముగిసిన తరువాత అభ్యర్థులను ప్రకటిస్తారని
రాష్ట్రం విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బొటాబొటీ మెజార్టీతో మైనార్టీ ప్రభుత్వాన్ని తొలి రోజుల్లో నడిపారు. ఆ తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకుని స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో సొంతగా 80 ప్లస్ స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకున్నారు. దీంతో విపక్షాల బలహీనత కొట్టొచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తోంది. మూడోసారి సీఎం కావడానికి విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ఆ పార్టీల్లోని గ్రూప్ విభేదాలు కేసీఆర్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రజాక్షేత్రంలో ఈసారి 25 మంది ఎమ్మెల్యేలకు మించి గెలుచుకోలేదని (First list Ready) సర్వేల సారాంశం.
Also Read : KCR-Modi: మోడీ టూరుకు మళ్లీ డుమ్మా!
తాజాగా అందిన సర్వేలను బేస్ చేసుకుని 15శాతం మంది సిట్టింగ్ లను తొలగించబోతున్నారు. అంటే, సుమారు 20 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ లేదని తేల్చేస్తున్నారు. వాళ్లతో ఇప్పటికే కేసీఆర్ మంతనాలు సాగించారని తెలుస్తోంది. ప్రగతి భవన్ వేదికగా తయారు అవుతోన్న రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులోభాగంగా ఆషాడం ముగిసిన తరువాత అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
Also Read : BRS vs Congress : తెలంగాణలో బీఆర్ఎస్‌కు సీన్ రివర్స్.. సర్వేల్లో..?