Site icon HashtagU Telugu

Warangal: మంటల్లో నోట్ల కట్టలు.. కారు దగ్ధం

Warangal

Warangal

Warangal: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున బయటకు వస్తున్న నోట్ల కట్టలు వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా అవుతున్నాయి.తాజాగా వరంగల్ జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తుతెలియని వ్యక్తులు వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగ రావడంతో డ్రైవర్ కారు ఆపి అక్కడి నుంచి పారిపోయాడు. కారులో 30 నుంచి రూ. 50 లక్షలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నోట్ల కట్టలు మంటల్లో కాలిపోగా కొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా దగ్ధమైన కారును మణునూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. కారు గుర్తింపు, అందులో ఉన్న నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Minister Harish Rao : ఓచోట కాకుండా మరో చోట లాండైన హరీష్‌ రావు హెలికాఫ్టర్‌