Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గుమ్మటం వద్ద మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 01:03 PM IST

తెలంగాణ కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గుమ్మటం వద్ద మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ప్లాస్టిక్‌కు మంటలు రాజుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సచివాలయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు తెలుసుకుంటున్నారు.

Also Read: Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా పోరాట నౌక గద్దర్ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయానికి ప్రభుత్వం అంబేద్కర్ భవన్ గా నామకరణం చేసింది.