Madhavi Latha : ముస్లిం మహిళలను తనిఖీ చేసిన మాధవీలత.. ఎఫ్ఐఆర్ నమోదు

Madhavi Latha : ముస్లింల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు అనుచితంగా ప్రవర్తించారంటూ హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి  మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

  • Written By:
  • Publish Date - May 13, 2024 / 03:06 PM IST

Madhavi Latha : ముస్లింల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు అనుచితంగా ప్రవర్తించారంటూ హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి  మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మలక్ పేట పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ స్టేషన్ లో ముస్లిం మహిళల నకాబ్ తొలగించి.. మొహం  పరిశీలించినందుకు మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌లోని 171 సీ, 186, 505 (1)తో పాటు ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 132 కింద మాధవీ లతపై(Madhavi Latha) కేసులు పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత మల్కాజిగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్లను మాధవీలత సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎంఐఎం దొంగ ఓట్లు వేయిస్తుందని గతంలో మాధవీలత ఆరోపించారు. ఈనేపథ్యంలో  ఆమె పలు పోలింగ్  కేంద్రాల వద్ద పలువురు ముస్లిం మహిళా ఓటర్లను నిశితంగా పరిశీలించారు. వారి బురఖా నకాబ్‌లను తొలగించి.. మొహం చూసేందుకు ప్రయత్నించారు. ఓటర్ల ఆధార్ కార్డులను మాధవీలత క్షుణ్ణంగా  తనిఖీ చేశారు. ఆధార్ కార్డుల్లోని ఫోటోలు, ముస్లిం మహిళల ముఖాలు సరిపోలడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

Also Read :KTR – AP Elections : ఏపీ ఎన్నికలపై మనసులో మాట చెప్పేసిన కేటీఆర్

ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో పోలింగ్ విషయంలో అప్రమత్తత అవసరం. నియోజకవర్గంలో కొందరిని ఓటు వేయకుండా చేస్తున్నారు. పోలీసులు చురుగ్గా లేరు. ఎవ్వరినీ విచారించడం లేదు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడికి వస్తున్నప్పటికీ వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. చనిపోయినవారి పేర్లతోనూ ఓట్లు వేస్తున్నారు. అజంపుర, గోషామహల్‌లో అక్రమాలపై ఈసీకి కంప్లైంట్ చేస్తాం’’ అని మాధవీలత తెలిపారు. ముస్లిం మహిళల నకాబ్‌లను మాధవీలత తీయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాధవీలత తీరుపై ఎంఐఎం కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమె పోలింగ్ బూతును తనిఖీ చేస్తున్నట్లు లేదని.. ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల బురఖాలు తీసే అధికారం మాధవీలతకు ఎవరిచ్చారని మజ్లిస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈవివరాలతో కూడిన ఒక వీడియోను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ రిట్వీట్ చేశారు.ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ‘‘నేను ఇంకా ఆ  వీడియో చూడలేదు. బీజేపీ కేవలం ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇలా చేయడం వల్ల అసదుద్దీన్‌ ఒవైసీకి సాయం చేసినట్లు అవుతుంది. దాని వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Also Read :Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను సీఎం పోస్టు నుంచి తీసేయండంటూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు