SI Results : ఈవారంలోనే ఎస్‌ఐ ఎగ్జామ్ రిజల్ట్స్.. తుది జాబితా కసరత్తు ముమ్మరం

SI Results :  ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వారం రోజుల్లో విడుదల చేయనుంది.

  • Written By:
  • Updated On - July 18, 2023 / 01:01 PM IST

SI Results :  ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వారం రోజుల్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. ఎస్సై తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. సామాజికవర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు… ఇలా దాదాపు 180కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఎస్సైల ఎంపికకు(SI Results)  మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీలను ప్రామాణికంగా తీసుకుంటారు.

Also read : Telangana Congress : కాంగ్రెస్ లో వ‌రుస చేరిక‌లు.. ఆయా జిల్లాలో నేత‌లు క‌లిసి ప‌ని చేసేనా..?

తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే.. 

ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. మొదట ఎస్సైలుగా ఎంపికైన 579 మంది, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చు అనేది తెలంగాణ పోలీసు నియామక బోర్డు ఆలోచన. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్ టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Also read : Surprise Reason Vs Mobile Towers : ఆ ఊరు సెల్ టవర్స్ కు నో చెప్పింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

క్లీన్ చిట్ నివేదిక లభిస్తేనే నియామక పత్రాలు 

ఎస్సై పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, నేర చరిత్రపై స్థానిక పోలీసు స్టేషన్ల నుంచి క్లీన్ చిట్ నివేదిక లభిస్తేనే నియామక పత్రాలు  అందజేయనున్నారు. ఎంపికయ్యే ఎస్సై అభ్యర్థులకు ఆగస్టు నుంచే ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల  తుది జాబితాను కూడా మరో రెండు వారాల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు.