తెలంగాణ లో వరుసగా మహిళా కానిస్టేబుల్స్ ఆత్మహత్య (Female Constable Commits Suicides) చేసుకోవడం సంచలనంగా మారింది. మొన్న నీలిమ (Neelima) , నేడు అర్చన (Archana) లు ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. వరంగల్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతంలో అర్చన అనే మహిళా కానిస్టేబుల్ చీరతో ఉరివేసుకుని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. 2022లో ఆమెకు వివాహం జరిగింది కానీ కొద్ది రోజులకే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె తీవ్ర మానసిక వేదనతో బాధపడుతూ వస్తున్నట్టు సమాచారం. తల్లి తండ్రుల వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న అర్చన, ఇటీవల తీవ్రమైన ఒత్తిడికి గురైంది.
Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయులకు సౌరబ్ గంగూలీ విజ్ఞప్తి
అర్చన ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అర్చన విడాకుల తర్వాత చాలా ఒంటరిగా ఒండిపోయిందని, ఏం మాట్లాడుతున్నా తక్కువగానే స్పందించేదని వెల్లడించారు. మానసికంగా పూర్తిగా శాంతి లేకపోవడంతో ఈ చర్యకు పాల్పడిందని భావిస్తున్నారు. ఈ విషాద ఘటనతో ఆమె సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదే తరహాలో మరో మహిళా కానిస్టేబుల్ నీలిమ ఇటీవల వరంగల్ జిల్లా నిలిబండ తండాలో ఆత్మహత్య చేసుకున్న విషయం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నీలిమ పెళ్లి కాకపోవడం వల్ల మానసిక వేదనతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. వరుసగా మహిళా కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మహిళా పోలీసుల మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.