Site icon HashtagU Telugu

Hyderabad : బోయిన్‌పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య

AP Student Suicide

సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి (Bowenpally ) పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్య (Father Commits Suicide) చేసుకోవడం అందర్నీ శోకసంద్రంలో పడేసింది. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది.

పోలీసులు తెలిపిన ప్రకారం..

బోయిన్‌పల్లికి చెందిన శ్రీకాంత్ చారి (Srikanth Chari) (42)కి భూదాన్‌ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి స్రవంతి (8), శ్రావ్య (7) అనే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ సిల్వర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి గురువారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే పిల్లలతో సహా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన భార్య అక్షయ.. కింది అంతస్తులో ఉంటున్న తన అత్త జయమ్మకు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటన స్థలానికి చేరుకొని మృతులను పోస్టుమార్టానికి పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. భర్త, పిల్లలు ప్రాణాలు తీసుకోవడం పట్ల భార్య అక్షయపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో కలహాలు లేదంటే ఆర్థిక వ్యవహారాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అంటున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌.. శ్రీకాంత్‌ నిద్రించిన ఇంట్లో ఆధారాలు సేకరించింది. సైనైడ్‌ తీసుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించింది. తమ మధ్య తగాదాలు ఏమీ లేవని భార్య అక్షయ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత అందరం ఒకే చోట నిద్రించామని.. ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిందన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో భవాని నగర్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Read Also : Chandrababu Angallu Case : అంగళ్ల కేసులో చంద్రబాబుకు భారీ ఊరట