Farmer Suicide Attempt : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

ధరణి పోర్టల్‌లో ఎంట్రీ చేసి తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తిరిగిన పట్టించుకోలేదంటూ తిరుగుతూనే ఉన్నామని

Published By: HashtagU Telugu Desk
Shamshabad Tehsildar Office

Shamshabad Tehsildar Office

శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం (Shamshabad Tehsildar Office) ముందు రైతు ఆత్మహత్యాయత్నం (Farmer Suicide Attempt) చేసుకోవడం కలకలంరేపింది. గ్రామానికి చెందిన రైతులు చెన్నకేశ కమలమ్మ, చెన్నకేష్ లక్ష్మయ్య భార్యాభర్తలపై ఘాన్సిమియగూడ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 4/7.4/8 లో ఇద్దరికీ ఎనిమిది ఎకరాల పట్టాభూమి ఉంది. ఈ భూమిని 1977 సంవత్సరంలో కొనుగోలు చేసారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా ధరణిలోవారిపై భూమి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే గత నవంబర్ 6వ తేదీన ధరణి పోర్టల్ నుండి శంషాబాద్ తహసీల్దార్ నాగమణి మా పట్టా భూమిని తొలగించిందంటూ అప్పటినుండి 9 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ధరణి పోర్టల్‌లో ఎంట్రీ చేసి తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తిరిగిన పట్టించుకోలేదంటూ తిరుగుతూనే ఉన్నామని ఈరోజు, రేపు అంటూ కాలయాపన చేసిందని వాపోతూ బుధవారం తహసీల్దారు కార్యాలయం ముందు సదరు రైతు చెన్నకేశవ కమలమ్మ వారి కొడుకులు సూరిబాబు చంద్రశేఖర్ ఆందోళనకు దిగారు. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడం తో వారు ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాన్ని బలవంతంగా అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేసారు. దీంతో సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే వచ్చి నీళ్లు పోయడంతో నిప్పు అంటుకోలేదు. తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందు ఆందోళన దిగారు.

Read Also : Gurukula Teachers Protest : పెద్ద‌మ్మ గుడి ముందు గురుకుల అభ్య‌ర్థుల భిక్షాట‌న‌

  Last Updated: 26 Jun 2024, 01:47 PM IST