Whats Today : వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ తాడోపేడో తేల్చుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాక్ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్ చేరకుండా ప్రపంచకప్‌లో దాని పోరాటం ముగుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యువ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని(Whats Today) ప్రసంగిస్తారు.
- ఇవాళ మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఈసందర్భంగా గులాబీ బాస్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్‌లోకి చేరనున్నారు.
- ఇవాళ వర్ధన్నపేటలో జరిగే బహిరంగ సభలోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్ నుంచి నేరుగా వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ చేరుకుంటారు.
- నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ 3వ రోజు బస్సుయాత్ర కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు.
- వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర రెండో రోజైన ఇవాళ గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో జరగనుంది. ఈరోజు తిరుపతిలో ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
Also Read: Russia – Hamas – Iran : బందీలను ఇరాన్‌కు అప్పగిస్తామని ప్రకటించిన హమాస్