Fake Video : ‘Hashtagu ‘ పేరుతో దుష్ప్రచారం..

  • Written By:
  • Updated On - March 10, 2024 / 12:20 PM IST

 

 

ఇటీవల సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచినదగ్గరి నుండి నిద్ర పోయేవరకు అంత సోషల్ మీడియాల్లోనే గడిపేస్తున్నారు. దీంతో చాలామంది మంచి కంటే చెడును ఎక్కువగా ప్రచారం చేస్తూ , ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఫేక్ వీడియోస్ , ఫేక్ లెటర్స్ , ఫేక్ మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్నారు.

సమాజంలో పేరుపొందిన కొన్ని సంస్థల పేర్లు, వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ వారికీ అనుగుణంగా ప్రచారం చేసుకుంటూ..సదరు సంస్థ ఫై ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా టీమ్ లను సైతం కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. క్షణాల్లో ఆ ఫేక్ వీడియోస్ రిచ్ అయ్యేలా సదరు టీమ్ పనిచేస్తుంటుంది. తాజాగా ‘Hashtagu ‘ పేరు వాడుకుంటూ ఓ వీడియో ను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. వాట్సాప్ , ట్విట్టర్ , పేస్ బుక్ , ఇన్స్టర్ ఇలా ప్రతిదాంట్లో ఈ వీడియో ను షేర్ చేస్తూ వస్తున్నారు.

వాస్తవానికి ఆ వీడియో కు , ‘Hashtagu ‘ సంస్థకు ఏ సంబంధం లేదు. అయినప్పటికీ ‘Hashtagu ‘ పేరుతో వైరల్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రజల్లో ‘Hashtagu ‘ కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారా..? రాజకీయ పార్టీలలో వ్యతిరేకత నింపడానికి ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కేవలం ఈ వీడియో మాత్రమేనా..లేక ఇంకేమైనా మార్ఫింగ్ వీడియోలతో ఏమైనా దుష్ప్రచారం చేస్తున్నారా అనే కోణంలో టెక్నీకల్ టీం అరా తీస్తుంది. దీనిపై ‘Hashtagu ‘ యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది.

 

Read Also : Rashmi Gautam : పుట్టెడు దుఃఖంలో యాంకర్ రష్మీ