తెలంగాణ ప్రభుత్వ బడుల్లో (Telangana Govt School) చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంటి పరీక్షలను (Eye Check-Up) నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దృష్టి లోపాలను గుర్తించి, అంధత్వ నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కంటి పరీక్షలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. గతేడాది కూడా రెండు విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించి వేలాది మంది విద్యార్థులలో కంటి సమస్యలు గుర్తించారు.
Kesineni Nani : రీ ఎంట్రీ పై కేశినేని క్లారిటీ
ప్రస్తుతం మూడో విడత కంటి పరీక్షల కోసం, డీహెచ్, డీఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంయుక్తంగా ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 59 ప్రదేశాల్లో ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 5 వరకు కంటి వైద్యులు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. దృష్టి లోపం ఉన్నవారికి అవసరమైన చికిత్సతో పాటు ఉచిత కళ్లజోళ్లు కూడా అందించనున్నారు.
ఈ ప్రత్యేక కంటి పరీక్షల ద్వారా, విద్యార్థులలో గల దృష్టి లోపాలను తొందరగా గుర్తించి, అవసరమైన చికిత్సను అందించేందుకు అవకాశం లభిస్తుంది. చాలా మంది చిన్నారులు తాము దృష్టి సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించకుండా ఉండటంతో, ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. పాఠశాలలో బాగా చదవడంలో కూడా కంటి సమస్యలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.