Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 13, 2021 / 11:13 AM IST

వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది.
కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

Also Read :  హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?

ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల అన్ని గ్రామాల్లో పుష్కలమైన నీరు ఉండడం, ఉచిత విద్యుత్, వరికి మద్దతు ధర ఉండడంతో తెలంగాణలో వరిసాగు ఎక్కువగా అయింది.వరి సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ నుండే ఎక్కువ ధాన్యం దాదాపు 63 శాతం వచ్చిందని,దేశంలో వరి ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి. ఇక బియ్యం కొనలేము అని కేంద్ర మంతి నితిన్ గడ్కరీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు.దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి నిల్వఉన్న ధాన్యాన్ని పంచితే మళ్ళీ రైతుల నుండి కొన్న ధాన్యాన్ని గిడ్డంగుల్లో పెట్టుకొనే ఛాన్స్ ఉన్నా కేంద్రం ఆవిధమైన అలోచన చేయడం లేదు.

Also Read : జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది

పంజాబ్ లో ఎన్నికలున్న నేపథ్యంలో అక్కడి రైతుల ధాన్యాన్ని కొంటామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కూడా కేంద్రం కొనాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఇరు పార్టీల వల్ల ఈ అంశం రాజకీయమవుతోంది.వరి సాగు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా అవుతోన్నా అక్కడి ప్రభుత్వాలు గానీ కేంద్రం గానీ ముందుచూపుతో ఆలోచించలేకపోయాయి,
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు సీరియస్ ప్రయత్నం జరగలేదు. ఉన్నట్టుండి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బలవంతపెట్టడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది.సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత ఉంది కాబట్టి సమిష్టిగా రెండు ప్రభుత్వాలు దీన్ని రాజకీయం చేయకుండా రైతులను నష్ట పరచకుండా చర్యలు చేపట్టకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో.